ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

నేడు చిరంజీవి 'ఖైదీ నం.150' మూవీ ప్రీ రిలీజ్ వేడుక.. పవన్ వస్తాడా? రాడా? జోరుగా బెట్టింగ్స్!

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘకాలం తర్వాత నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు ప్రీరిలీజ్ వేడుక గుంటూరు వేదికగా శనివారం నిర్వహిస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘకాలం తర్వాత నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు ప్రీరిలీజ్ వేడుక గుంటూరు వేదికగా శనివారం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
 
మెగాస్టార్ కుటుంబసభ్యులంతా తరలివస్తున్న ఈ స్టార్‌ షోనూ వీక్షించేందుకు అభిమానులు కూడా భారీగా తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక వేడుకలో దేవీశ్రీ ప్రసాద్ మ్యుజికల్‌ షోలో మెగా కుటుంబసభ్యులు కనువిందు చేయనున్నారు.
 
ఇకపోతే... ఈ ఫంక్షన్‌కు అతిరథ మహారథులు హాజరుకానున్నారు. వీరందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి కూడా. అలాగే, హీరో పవన్ కళ్యాణ్‌కు కూడా వెళ్లింది. కానీ, ఆయన వస్తారా లేదా అనే అంశంపై ఇపుడు జోరుగా చర్చతో పాటు.. బెట్టింగ్స్ సాగుతున్నాయి. 
 
ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం లేదని నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ, మెగా ఫ్యామిలీ మాత్రం పవన్ వచ్చేలా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. చివరకు పవన్‌ను ఆహ్వానించేందుకు చిరంజీవి సతీమణి సురేఖ కూడా స్వయంగా రంగంలోకి దిగినట్టు వార్తలు వచ్చాయి. దీంతో పవన్ రాకపై జోరుగా బెట్టింగ్స్ కూడా జరుగుతుండటం గమనార్హం.