మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (15:29 IST)

ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు రోజు.. అల్లరి నరేష్‌తో అలా అన్నాడట.. నాకు పట్టిన గతి..?

వెండితెరపై కనిపించి సక్సెస్ అయ్యేవారు కొందరైతే.. ఛాన్సులు దొరక్కకుండా ప్రతిభను పాతిపెట్టేసి.. వేరే పనుల్లో ఇమిడిపోయి కాలాన్ని అయిష్టంగా నెట్టేవారు మరికొందరు. అలాగే వెండితెరపై కనిపించినా కెరీర్‌లో ఏమీ

వెండితెరపై కనిపించి సక్సెస్ అయ్యేవారు కొందరైతే.. ఛాన్సులు దొరక్కకుండా ప్రతిభను పాతిపెట్టేసి.. వేరే పనుల్లో ఇమిడిపోయి కాలాన్ని అయిష్టంగా నెట్టేవారు మరికొందరు. అలాగే వెండితెరపై కనిపించినా కెరీర్‌లో ఏమీ సాధించలేదని బాధపడి ఆత్మహత్య చేసుకున్న వారూ ఉన్నారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి 'చిత్రం' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
ఉదయ్ కిరణ్ యంగ్ స్టార్ హోదాలో హిట్ సినిమాలతో దూసుకెళ్లాడు. కానీ అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. చివరికి ప్రాణాలే కోల్పోయాడు. అయితే ఉదయ్ కిరణ్‌కు సినిమాలంటే ప్రాణమని.. తన జీవితంలో ఇలా తయారయ్యేందనే మనోవేదనకు ఎన్నోసార్లు గురయ్యాడని.. హీరో అయిన అల్లరి నరేష్ అన్నాడు. చనిపోయేందుకు ముందు ఉదయ్ ఎంతో ఆవేదనతో ఏం మాట్లాడాడో నోరు విప్పి చెప్పాడు అల్లరి నరేష్. 
 
ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడేందుకు ముందు రోజు చాలా బాధపడ్డాడని అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ రోజు ఉదయ్ కిరణ్‌ను కలిశానని.. అతని ముఖంలో దిగులు కనిపించిందని చెప్పుకొచ్చాడు. ఎందుకలా ఉన్నావని ప్రశ్నిస్తే.. ఉదయ్ ఇచ్చిన సమాధానంతో అల్లరి నరేష్‌కు మైండ్ బ్లోయింగ్ అనిపించిందట. ఆ రోజు పేపర్లో ప్రచురితమైన ఓ సినిమా హీరో గురించి చెప్పుకొచ్చాడని వెల్లడించాడు.
 
ఆ హీరో కథలను సరిగ్గా ఎంచుకోవట్లేదని ఉదయ్ బాధపడ్డాడట. అయితే ఇవన్నీ కామన్ కదా.. ఎందుకలా బాధపడుతున్నావని ఉదయ్‌కి తాను చెప్పినా.. అతడు పట్టించుకోలేదని.. సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా కథలు ఎంచుకోవడంలో మార్పుచేసుకోకపోతే.. ఉదయ్ కిరణ్‌కు పట్టిన గతే పడుతుందని వాపోయినట్లు నరేష్ వెల్లడించాడు. దీంతో అల్లరి నరేష్ ఉదయ్‌కి ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయాడట.