శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 జూన్ 2017 (13:51 IST)

అనుష్క బరువుతో భాగమతికీ తప్పని ఇక్కట్లు- స్వీటీని బ్యూటీగా చూపెట్టేందుకు?

బాహుబలి2లో అనుష్కను నాజుగ్గా చూపించేందుకు జక్కన్న రాజమౌళి.. కాస్త ఎక్కువగానే నిర్మాతలను ఖర్చుపెట్టమన్నాడు. ఈ సినిమాలో దేవసేనగా నటించిన అనుష్కను అందంగా చూపెట్టేందుకు జక్కన్న చేసిన ప్రయత్నాలన్నీ ప్లస్ అ

బాహుబలి2లో అనుష్కను నాజుగ్గా చూపించేందుకు జక్కన్న రాజమౌళి.. కాస్త ఎక్కువగానే నిర్మాతలను ఖర్చుపెట్టమన్నాడు. ఈ సినిమాలో దేవసేనగా నటించిన అనుష్కను అందంగా చూపెట్టేందుకు జక్కన్న చేసిన ప్రయత్నాలన్నీ ప్లస్ అయ్యాయి.

అయితే భాగమతి సంగతికి వస్తే.. బాహుబలికి తర్వాత కూడా అనుష్క బరువు తగ్గకపోవడంతో.. వీఎఫ్ఎక్స్ సంస్థనే భాగమతి టీమ్ సంప్రదించేందుకు రెడీ అయిపోయింది. ఎందుకంటే అనుష్కను స్లిమ్‌గా చూపెట్టేందుకు జక్కన్న ఉపయోగించిన టెక్నాలజీనే భాగమతి టీమ్ కూడా ఉపయోగించుకోవాలనుకుంటోంది.
 
ఇందులో భాగంగా.. భాగమతి నిర్మాతలు కాస్త ఎక్కువైనా పర్లేదు.. ఖర్చు చేసేందుకు సై అంటున్నారు. సినిమా హిట్ కావాలన్నదే తమ లక్ష్యమని చెప్తున్నారు. భాగమతి సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీల్లో రిలీజే చేసేందుకు సన్నాహాలు జరుగుతుండటంతో.. స్వీటీని బ్యూటీగా చూపెట్టేందుకు వీఎఫ్ఎక్స్ సంస్థతో మాట్లాడి.. డబ్బు ఖర్చు పెట్టేందుకు భాగమతి టీమ్ రెడీ అయిపోతోంది. కాగా సైజ్ జీరోతో బరువు పెరిగిపోయిన అనుష్క.. బరువును తగ్గించేందుకు నానా తంటాలు పడుతోంది. ఇక భాగమతి ఆగస్టులో తెరపై కనిపించనుంది.
 
ఇదిలా ఉంటే.. భారీ విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న సినీ న‌టి అనుష్క‌కి కోప‌మొచ్చింది. సోష‌ల్ మీడియాలో ఆమెపై పలువురు అదే ప‌నిగా పుట్టిస్తోన్న పుకార్లపై ఆమె సీరియస్ అయ్యింది.

తాను ఇప్పటి వ‌ర‌కు ఎంతో సహనంగా ఉన్నాన‌ని, ఇక‌పై మాత్రం అటువంటి పుకార్లను వ్యాప్తి చేసే వారి ప‌ట్ల క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తాన‌ని తెలిపింది. ప్రభాస్‌తో అనుష్క వివాహం జరుగనుందంటూ వచ్చిన పుకార్లపై అనుష్క స్పందించింది. ప్ర‌భాస్‌కి, త‌న‌కు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్ర‌మేన‌ని వివరణ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆమెపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.