గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2016 (13:30 IST)

దేవసేన అనుష్కకు వయస్సు పెరిగే కొద్దీ క్రేజూ పెరుగుతోంది... 2017లో 4 సినిమాలు రిలీజ్..

బాహుబలి దేవసేన అనుష్కకు వయస్సు పెరిగే కొద్దీ క్రేజూ పెరిగిపోతోంది. దక్షిణాదిన నయనతార, అనుష్కలకు 3 పదులు దాటినా అవకాశాలకు ఏమాత్రం కొదువలేదు. 30 ప్లస్‌లో అనుష్క తెలుగు, తమిళ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా క

బాహుబలి దేవసేన అనుష్కకు వయస్సు పెరిగే కొద్దీ క్రేజూ పెరిగిపోతోంది. దక్షిణాదిన నయనతార, అనుష్కలకు 3 పదులు దాటినా అవకాశాలకు ఏమాత్రం కొదువలేదు. 30 ప్లస్‌లో అనుష్క తెలుగు, తమిళ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఎంతమంది యంగ్ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినా వాళ్ళందరికీ అనుష్క కాంపిటీషన్ ఇస్తోంది. సినిమాలు, రెమ్యునరేషన్ విషయంలో అనుష్క యంగ్ హీరోయిన్లకి అందనంత ఎత్తులో వుంది. 
 
2005లో సూపర్  సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. కొంతకాలం నిలదొక్కుకోవడానికి కష్టపడింది. అయితే అరుంధతి సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆపై  టాలీవుడ్ టాప్ హీరోలు బాలయ్య, వెంకీ, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. 
 
కానీ బాహుబలి సినిమాలో నటించి మరింత హైప్ కొట్టేయనున్న అనుష్క.. ఇప్పటికీ నాలుగు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. బాహుబలి 2లో ఆమె చేసే పాత్ర ఎలా ఉంటుందని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్న తరుణంలో.. వచ్చే ఏడాది అమ్మడుకు బాగా కలిసివచ్చేలా ఉంది. అనుష్క లీడ్ రోల్ చేసిన బాహుబలి 2, భాగమతి, నమో వేంకటేశాయ, సింగం 3 సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.