ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 మార్చి 2017 (18:03 IST)

ఉత్తమ నటుడు ప్రభాస్.. 'మిర్చి' చిత్రానికి నంది అవార్డుల పంట

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన మిర్చికి నంది అవార్డుల పంట పండింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్, సత్యరాజ్య, నదియ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన మిర్చికి నంది అవార్డుల పంట పండింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్, సత్యరాజ్య, నదియ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకుగానూ వెండితెరకు సంబంధించిన నంది అవార్డులను ప్రకటించింది. 
 
2012లో ఉత్తమ చిత్రంగా 'ఈగ', 2013లో ఉత్తమ చిత్రంగా 'మిర్చి' ఎంపికయ్యాయి. 2012 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నానికి చోటు దక్కగా, 2013 సంవత్సరానికి గానూ ప్రభాస్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ అవార్డులను రెండు విడతలుగా ప్రకటించారు. మొదటి ప్యానెల్‌లో జయసుధ అవార్డులను ప్రకటించగా, రెండో ప్యానెల్‌లో దర్శకుడు కోడి రామకృష్ణ ఈ అవార్డులను ప్రకటించారు. కాగా, 2013 సంవత్సరానికి గాను మిర్చి చిత్రం ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. 
 
2013 నంది అవార్డుల ప్రకటన
ఉత్తమ చిత్రం- మిర్చి 
రెండో ఉత్తమ చిత్రం-నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం- ఉయ్యాల జంపాల
కుటుంబకథాచిత్రం- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ నటుడు- ప్రభాస్‌ (మిర్చి)
బెస్ట్ పాపులర్ చిత్రం: అత్తారింటికి దారేది
ఉత్తమ నటి: అంజలి పాటిల్ (నా బంగారు తల్లి)
సహాయనటుడు- ప్రకాశ్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
సహాయనటి- నదియా (అత్తారింటికి దారేది)
ఎస్వీ రంగారావు అవార్డు- నరేశ్
అల్లు రామలింగయ్య అవార్డు - తాగుబోతు రమేశ్
ఉత్తమ విలన్- సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ దర్శకుడు - కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ రచయిత- మేర్లపాక గాంధీ
ఉత్తమ కథా రచయిత- ఇంద్రగంటి మోహనకృష్ణ
ఉత్తమ మాటల రచయిత- త్రివిక్రమ్ శ్రీనివాస్
ఉత్తమ గేయ రచయిత- సిరివెన్నెల
ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీశ్రీప్రసాద్ (మిర్చి)
ఉత్తమ తొలి దర్శకుడు- కొరటాల శివ (మిర్చి)
జాతీయ సమగ్రత చిత్రం డాక్యుమెంటరీ ఫిలిం- భారత కీర్తి మూర్తులు