బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (13:40 IST)

#1500CroreBaahubali : రిమార్కబుల్ మైల్‌స్టోన్.. థ్యాంక్స్‌ టు ఎవ్రివన్... బాహుబలి టీమ్

సరిగ్గా మూడంటే మూడు వారాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి: ది కన్ క్లూజన్' అనిర్వచనీయమైన రికార్డును అందుకుంది. ఈ సినిమా రూ. 1500 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకుంటుందని గత మూడు రోజులుగా సినీ విశ్ల

సరిగ్గా మూడంటే మూడు వారాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి: ది కన్ క్లూజన్' అనిర్వచనీయమైన రికార్డును అందుకుంది. ఈ సినిమా రూ. 1500 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకుంటుందని గత మూడు రోజులుగా సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుండగా, అది నేడు నిజమైంది. ప్రపంచ బాక్సాఫీసు చరిత్రలో మరే భారత సినిమాకూ సాధ్యంకాని రికార్డును బాహుబలి అందుకుంది.
 
గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్ల వసూళ్లను సాధించి.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రూ.1000 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డుకెక్కింది. ఇపుడు ఎవరెస్ట్ శిఖరం అంతటి ఎత్తైన మైలురాయిని చేరుకుంది. అంటే.. రూ.1500 కోట్ల వసూళ్లను సాధించి భారతీయ చిత్ర యవనికపై ఎవరూ అందుకోలేనంద ఎత్తులో నిలించింది. 
 
ఇదే అంశంపై బాహుబలి చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. "ఇట్స్ గెట్టింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్... సచ్ ఏ రిమార్కబుల్ మైల్‌స్టోన్!! థ్యాంక్యూ ఎవ్రివన్ ఫర్ యువర్ సపోర్ట్ అంటూ బాహుబలి పేరుతో ట్వీట్ చేశారు. ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదలైన సరికొత్త రికార్డులు నెలకొల్పున్న విషయం తెల్సిందే. ఇంకా నెల రోజులు కూడా పూర్తికాకుండానే రూ.1500 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఖ్యాతిగడించింది. 
 
అలాగే, ఈ సినిమా కలెక్షన్లు రూ.1500 కోట్లను దాటాయని ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఇండియాలో రూ.1,227 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 275 కోట్లను వసూలు చేసిందని మొత్తం రూ.1,502 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని ఆయన వెల్లడించాడు. సినిమా కలెక్షన్లు ఇంకా సంతృప్తికరంగా ఉండటం, మరో పెద్ద చిత్రం ఇప్పట్లో పోటీలో లేకపోవడం, వేసవి సెలవులు కొనసాగుతూ ఉండటంతో ఇక రూ.2 వేల కోట్ల కలెక్షన్స్‌పై బాహుబలి కన్నేసిందని భావించవచ్చు.