శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 18 మే 2017 (19:25 IST)

రాజమౌళి తల్లకిందులా తపస్సు చేసినా ఆ రికార్డు బద్ధలు కొట్టలేరు....

సంచలన దర్శకుడు రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ రూ. 1500 కోట్లను దాటుకుని రూ.2000 కోట్ల వైపు దూసుకెళుతోంది. ఐతే బాహుబలి ది బిగినెంగ్ కేవలం 700 కోట్ల వద్ద ఆగిపోయింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బాహుబలి ది కంక్లూజ

సంచలన దర్శకుడు రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ రూ. 1500 కోట్లను దాటుకుని రూ.2000 కోట్ల వైపు దూసుకెళుతోంది. ఐతే బాహుబలి ది బిగినెంగ్ కేవలం 700 కోట్ల వద్ద ఆగిపోయింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ రికార్డును కొల్లగొట్టడం ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరికీ సాధ్యం కాదనే మాట వినబడుతోంది. సహజంగా జక్కన్న తన రికార్డును తనే బద్ధలు కొట్టుకుంటూ వుంటాడు. 
 
ఐతే బాహుబలి రికార్డును మాత్రం రాజమౌళి మరో కొత్త చిత్రం తీసుకుని తలకిందులుగా తపస్సు చేసినా రికార్డును అధిగమించలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు బాహుబలి చిత్రంలా మళ్లీ అదే ఫార్ములాతో సినిమా తీయబోననీ, ఎలాంటి గ్రాఫిక్స్ ఉపయోగించకుండా తన తదుపరి చిత్రం వుంటుందని అనుకుంటున్నారు. కాబట్టి రాజమౌళి ఇలా తన రికార్డును అధిగమించడానికి ఇష్టపడటం లేదన్నమాట.