శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (15:14 IST)

బాహుబలి ది ఎండింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్.. పండగ చేసుకున్న టీమ్

బాహుబలి ది ఎండింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీంతో యూనిట్‌తో అంతా పండగ చేసుకున్నారు. గుమ్మడికాయ కొట్టిన వీడియోను ప్రభాస్ షేర్ చేశాడు. ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపాడు. అంతకంటే ముందు

బాహుబలి ది ఎండింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీంతో యూనిట్‌తో అంతా పండగ చేసుకున్నారు. గుమ్మడికాయ కొట్టిన వీడియోను ప్రభాస్ షేర్ చేశాడు. ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపాడు. అంతకంటే ముందు రాజమౌళి, ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు.

బాహుబలి రెండు భాగాలు కలిపి సరిగ్గా 613 రోజులు షూటింగ్ పూర్తిచేసుకుందని ప్రకటించాడు. ఒక దశలో బరువు పెరిగి, మరోసారి బరువు తగ్గి.. సినిమా కోసం రకరకాలుగా కష్టపడ్డాడు. బాహుబలి-2 ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇన్నిరోజులు తనకు సహకరించిన ప్రభాస్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు.
 
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' శుక్రవారంతో పూర్తయిన నేపథ్యంలో.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకి జవాబు దొరికే రోజు మరింత తక్కువైంది. మూడున్నరేళ్లుగా మరో సినిమా ఆలోచనే లేకుండా కేవలం 'బాహుబలి'తోనే ప్రయాణం చేసిన హీరో ప్రభాస్‌కి కూడా శుక్రవారమే ఆఖరి షూటింగ్ రోజు. ఆ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.