సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 17 మార్చి 2017 (09:56 IST)

ఒక ట్రైలర్‌ చూడటానికి థియేటర్లకు పరుగెత్తిన జనం. బ్రేక్ డౌన్ అయిన యూట్యూబ్

రెండున్నర నిమిషాల వీడియో ట్రైలర్ చూడటానికి వేలమంది జనం థియటర్లకు పరుగు తీశారు. ఆన్‌లైన్ వెర్షన్ చూడటానికి తొలిరోజే కోటిన్నరమందికి కీబోర్డుపై వేళ్లు టకటకలాడించారు. ఇది సమకాలీన చలనచిత్ర చరిత్రపై రాజమౌళి చిత్రించిన బాహుబలియన్ ముద్ర. దాని దెబ్బకు యూట్యూబ

రెండున్నర నిమిషాల వీడియో ట్రైలర్ చూడటానికి వేలమంది జనం థియటర్లకు పరుగు తీశారు. ఆన్‌లైన్ వెర్షన్ చూడటానికి తొలిరోజే కోటిన్నరమందికి కీబోర్డుపై వేళ్లు టకటకలాడించారు. ఇది సమకాలీన చలనచిత్ర చరిత్రపై రాజమౌళి చిత్రించిన బాహుబలియన్ ముద్ర. దాని దెబ్బకు యూట్యూబ్ రికార్డు బద్దలైంది. దర్శకుడి మాటల్లోనే చెప్పాలంటే తొలి గంటలో తెలుగు వీడియో ట్రైలర్‌ని పది లక్షలమంది చూసేశారు. గురువారం రాత్రికి 1కోటీ 40 లక్షలమంది జుర్రేశారు. ఇది జియో సిమ్ తీసుకువచ్చిన స్మార్ట్ ఫోన్ మహత్యమా లేక సినిమాపై కోట్లమంది పెట్టుకున్న వెర్రా తెలీదు కానీ మెగాస్టార్లు, పవర్ స్టార్లు, నటరత్నలూ, ఆ స్టార్లూ, ఈ స్టార్లూ అందరి రికార్డులూ బొక్క బొర్లపడ్డాయనేది జనం మాట.
 
తెలంగాణలో అయితే గురువార్ ఉదయం 9 గంటలకే  సింగిల్ స్క్రీన్‌లపై బాహుబలి ది కన్‌క్లూజన్ వీడీయో ట్రైలర్‌ను చూడటానికి జనం పొటెత్తారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్సన్ 35 ఎంఎం థియేటర్ వద్ద వందలాది జనం గుమికూడారు. తెలంగాణలో 41 థియేటర్లలో బాహుబలి 2 వీడీయో ట్రైలర్ విడుదలైంది. ప్రతిచోటా జనమే జనం. 
 
నగరంలోని ఒక ధియేటర్లో బాహుబలి 2 వీడియో ట్రైలర్ చూసిన వంశీ అనే విద్యార్థి మాట్లాడుతూ, ఒక కొత్త సినిమాను తొలి రోజే చూసినంత ఫీలింగ్ కలుగుతోందని అబ్బురపడుతూ చెప్పాడు. థియేటర్లో ట్రయిలర్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్రం విడుదలైన రోజే ఈ సినిమాను చూడగలనని భావిస్తున్నా అన్నాడు. 
 
భాహుబలి 2 గురించి గత సంవత్సన్నర కాలంగా సోషల్ మీడియాలో వస్తున్న అంచనాలు, ఊహలు గురించి తానేమీ కలవరపడటం లేదని చిత్ర దర్శకుడు రాజమౌళి చెప్పారు. రెండో భాగంలో ప్రేక్షకులు మరింత నాయకీయతను, కనువిందు చేసే యాక్షన్ దృశ్యాలను చూస్తారని చెప్పారు.