మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (17:10 IST)

'బాహుబలి-2' గ్రాఫిక్స్ ఎడిటర్ అరెస్టు... ఫ్రెండ్స్‌కు షేర్ చేసి చిక్కుల్లో పడ్డాడు...

"బాహుబలి-2" ఆర్టిస్ట్ గ్రాఫిక్స్ ఎడిటర్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను దొంగిలించి తన స్నేహితులకు షేర్ చేయడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

"బాహుబలి-2" ఆర్టిస్ట్ గ్రాఫిక్స్ ఎడిటర్‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను దొంగిలించి తన స్నేహితులకు షేర్ చేయడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 
 
'బాహుబలి-2' సినిమాకు సంబంధించి 9 నిమిషాల నిడివిగల సీన్ ఇంటర్నెట్‌లో లీక్ అయినట్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై నిర్మాతలు సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశారు.
 
ఎడిటింగ్ జరుగుతున్న స్థలంలో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, కొంత కీలక సమాచారం అధారంగా కృష్ణ దీనిని తస్కరించాడని చిత్ర బృందం నిర్ధారించి ఈ ఫిర్యాదు చేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు గ్రాఫిక్స్ ఎడిటర్ కృష్ణను విజయవాడలో అరెస్టు చేశారు.