సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By JSK
Last Modified: మంగళవారం, 22 నవంబరు 2016 (19:18 IST)

బాహుబ‌లి 2 లీకేజీ చేసి... బెజ‌వాడ‌లో తేలిన గ్రాఫిక్స్ డిజైన‌ర్ కృష్ణ... అరెస్ట్

విజ‌య‌వాడ‌: బాహుబలి 2 సినిమాలో 9 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తస్కరించిన గ్రాఫిక్స్ డిజైన‌ర్ కృష్ణ అరెస్ట్ అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోలో బాహుబలి 2 గ్రాఫిక్స్ ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న కృష్ణ ఈ చిత్రంలో కొంత భాగాన్ని త‌న పెన్ డ్రైవ్‌లో ఎక్కించుక

విజ‌య‌వాడ‌: బాహుబలి 2 సినిమాలో 9 నిమిషాల నిడివి గల సన్నివేశాలను తస్కరించిన గ్రాఫిక్స్ డిజైన‌ర్ కృష్ణ అరెస్ట్ అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోలో బాహుబలి 2 గ్రాఫిక్స్ ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న కృష్ణ ఈ చిత్రంలో కొంత భాగాన్ని త‌న పెన్ డ్రైవ్‌లో ఎక్కించుకుని త‌స్క‌రించాడు. దీనిపై చిత్ర నిర్మాతలు హైద‌రాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసుల‌కు నిందితుడు కృష్ణ విజ‌య‌వాడ‌కు చేరిన‌ట్లు స‌మాచారం అందింది. దీనితో వారు విజయవాడ పోలీసుల‌ను అలెర్ట్ చేశారు. నిందితుడు కృష్ణ‌ను విజ‌య‌వాడ‌లో అరెస్ట్ చేశారు. 
 
రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీస్తున్న సినిమా ఇంకా రిలీజ్ కాక‌ముందే, లీక్ కావ‌డం ప‌రిశ్ర‌మ‌కు షాక్ క‌లిగించింది. అనుష్క‌, ప్ర‌భాస్‌ల‌పై చిత్రీక‌రించిన వార్ సీక్వెన్స్ నెట్లో ప్ర‌త్య‌క్షం అయింది. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న‌నిర్మాత‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.