శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 జులై 2017 (14:07 IST)

'టీజర్‌ కా బాప్ ... ట్రైలర్‌ కా బేటా' అంటూ "పైసా వసూల్" ఫస్ట్ లుక్ రిలీజ్ (Video)

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రం "పైసా వ‌సూల్". ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ కొండాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రం "పైసా వ‌సూల్". ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ కొండాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్స్‌ను పూరీ జగన్నాథ్.. కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. 
 
చిత్రం 'స్టంపర్' ఈ నెల 28న ఉదయం 10.22కు విడుదల చేస్తామని చెబుతూ 'టీజర్‌ కా బాప్... ట్రైలర్‌ కా బేటా' అంటూ 24 సెకన్ల నిడివి వున్న ఫోటోలతో కూడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇందులో బాలయ్య గడ్డంతో స్టన్నింగ్ లుక్స్‌తో కనిపిస్తుండటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన నిమిషాల్లోనే దీన్ని వేల మంది చూసేశారు. కాగా, ఈ చిత్రం వచ్చే నెలాఖరులో విడుదల కానుంది.