మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 31 జులై 2017 (15:22 IST)

జూ.ఎన్టీఆర్ 'బిగ్ బాస్' కంటే కమల్ 'బిగ్ బాస్'ను ఇష్టపడుతున్న తెలుగు హీరోయిన్

తమిళ బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డుతో ఎంట్రీ అయిన నటి బిందుమాధవి కమల్ హాసన్ హాస్టుగా కొనసాగుతున్న తమిళ బిగ్ బాస్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు బిగ్ బాస్ కంటే బాగా ఇష్టమని చెపుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో మరింత లోతుగా వెళితే... నేను తమిళ బిగ్ బాస్, తెలుగు బి

తమిళ బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డుతో ఎంట్రీ అయిన నటి బిందుమాధవి కమల్ హాసన్ హాస్టుగా కొనసాగుతున్న తమిళ బిగ్ బాస్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు బిగ్ బాస్ కంటే బాగా ఇష్టమని చెపుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో మరింత లోతుగా వెళితే... నేను తమిళ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ రెండూ ఫాలో అయ్యా. 
 
జూ.ఎన్టీఆర్ హోస్టుగా చేస్తున్న తెలుగు బిగ్ బాస్ మొదటి వారం తర్వాత ఇప్పటివరకూ చూడలేదు. ఐతే తమిళ బిగ్ బాస్ మాత్రం క్రమం తప్పకుండా వరుసబెట్టి చూస్తూనే వున్నా. కమల్ సర్ హోస్టింగ్ సూపర్బ్.. అంటూ ఆకాశానికెత్తేసింది. 
 
తెలుగు హీరోయిన్ బిందుమాధవి, కమల్ హాసన్ బిగ్ బాస్‌ను ఆకాశానికెత్తేయాలంటే జూ.ఎన్టీఆర్ బిగ్ బాస్ షోను కించపరుస్తూ మాట్లాడాలా అంటూ జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. తమిళంలో కాస్త ఛాన్సులు వస్తుండేసరికి ఆమె ఇలా మాట్లాడుతుందేమో మరి.