గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (10:34 IST)

హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్ బాస్' భామ అషు రెడ్డి?

ashu reddy
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డికి లక్కీఛాన్స్ వరించినట్టు ప్రచారం జరుగుతుంది. అరవింద్ కృష్ణ హీరోగా తెరకెక్కే "ఏ మాస్టర్ పీస్" అనే చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. టాలీవుడ్ నటుడు అరవింద్ కృష్ణ హీరోగా ఇటీవలే ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో అషు రెడ్డికి ఛాన్స్ దక్కింది. 
 
సుకు పుర్వజ్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి "ఏ మాస్టర్ పీస్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కండ్రగుల శ్రీకాంత్ నిర్మాత. ఇందులో హీరోయిన్‌గా అషు రెడ్డిని ఎంపిక చేసినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
 
కాగా, 2018లో అషు రెడ్డి చివరిసారి వెండితెరపై కనిపించారు. నితిన్ - మేఘా ఆకాశ్ జంటగా నటించిన "ఛల్ మోహనరంగ" చిత్రంలో ఆమె ఓ పాత్రను పోషించారు. ఇపుడు హీరోయిన్‌గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇటు అషు రెడ్డి, అటు చిత్ర యూనిట్ స్పందించలేదు.