బుధవారం, 15 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (14:52 IST)

పవన్ కళ్యాణ్ బాటలో హృతిక్ రోషన్... మాజీ భార్య కోసం అలా చేస్తున్నాడు...

సినిమావాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు... మళ్లీ కలిసిపోవడాలు చూస్తుంటే... సమాజం కూడా ఇలాగే మార్పు చెందిపోయిందా అనే అనుమానం కలుగక మానదు. కాస్తాకూస్తో మారిపోయే వుంటుందిలెండి. ఎందుకంటే సినీ హీరోలు,

సినిమావాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు... మళ్లీ కలిసిపోవడాలు చూస్తుంటే... సమాజం కూడా ఇలాగే మార్పు చెందిపోయిందా అనే అనుమానం కలుగక మానదు. కాస్తాకూస్తో మారిపోయే వుంటుందిలెండి. ఎందుకంటే సినీ హీరోలు, హీరోయిన్లు పాటిస్తున్న పద్ధతులను చూసి కూడా వారిని గుండెల్లో దేవుళ్లు, దేవతల్లా కొలుస్తున్నారంటే అలా అనుకోకుండా ఇంకేం అనుకోగలం మరి. సరే ఆ సంగతి అలా పక్కనపెడదాం.
 
ఇప్పడసలు విషయం ఏంటయా అంటే... బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసాన్నే ఖాన్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. ఐతే వున్నట్లుండి వీరిద్దరూ తిరిగి సన్నిహితంగా మారిపోయారు. మాజీ భార్య సుసాన్నే కోసం తన ఇంటి పక్కనే మరో ఇల్లు కొనేశాడు హృతిక్ రోషన్. సౌలభ్యం కోసమట... అంటే దూరంగా వుంటే గబుక్కున కలుసుకోవాలంటే కాస్త టైం పడుతుంది కదా... అందుకే ఇంటి పక్కనే అయితే ఎప్పుడంటే అప్పుడు కలుసుకుని ఎంచక్కా ముచ్చట్లు చెప్పుకోవచ్చు. సరదాగా టెర్రస్ పైకి ఎక్కి ఏమయినా ఆటలాడాలాంటే ఆ ఆటలు ఆడుకోనూవచ్చు. 
 
హృతిక్ రోషన్ చేసిన పనిని చూసిన కొంతమంది పవన్ కళ్యాణ్ దారిలో హృతిక్ నడుస్తున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన మాజీ భార్య రేణూ దేశాయ్‌ను, పిల్లల్ని కాస్తోకూస్తో ఆదుకుంటున్నారనే టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్నది. మొత్తమ్మీద బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఆ విషయంలో పవన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారన్నమాట.