'పేకాట'ను ప్రోత్సహిస్తున్న హీరో రానా.. సామాజిక కార్యకర్త ఫిర్యాదు... కేసు నమోదు

వివాదాలకు దూరంగా ఉండే 'బాహుబలి' విలన్, హీరో దగ్గుబాటి రానా ఇపుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఈయన పేకాట (రమ్మీ)ని ప్రోత్సహిస్తున్నారంటూ తమిళనాడు వాసి కేసు పెట్టాడు. దీంతో వివాదంలోకి రావాల్సిన పరిస్థితి ఏర

rana rummy play
pnr| Last Updated: శుక్రవారం, 21 అక్టోబరు 2016 (15:03 IST)
వివాదాలకు దూరంగా ఉండే 'బాహుబలి' విలన్, హీరో దగ్గుబాటి రానా ఇపుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఈయన పేకాట (రమ్మీ)ని ప్రోత్సహిస్తున్నారంటూ తమిళనాడు వాసి కేసు పెట్టాడు. దీంతో వివాదంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన పి.ఇళగోవన్ అనే సామాజిక కార్యకర్త రానాపై కేసు పెట్టాడు. రానాతో పాటు ప్రకాష్ రాజ్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'రానా, ప్రకాష్ రాజ్‌లు పలు వెబ్‌సైట్ల ద్వారా గాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. రమ్మీ ఆడేందుకు పురిగొల్పేలా ప్రకటనలు ఇస్తున్నారు. టీవీల్లోనూ అవి ప్రసారమవుతున్నాయి. వీరు ప్రచారం చేసే సైట్ సహా పలు వెబ్‌సైట్లు కూడా బెట్టింగ్‌కు పురిగొల్పుతున్నాయి' అంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కాగా, బెట్టింగ్, రమ్మీ, గాంబ్లింగ్‌లపై తమిళనాడు రాష్ట్రంలో నిషేధం ఉండటంతో ఇళగోవన్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతో భల్లాల దేవుడికి తిప్పలు తప్పేలా లేవు.దీనిపై మరింత చదవండి :