మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (12:09 IST)

'మెగా సర్జికల్‌ స్ట్రైక్‌... లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు'... "ఖైదీ"’పై సినీ ప్రముఖుల ట్వీట్లు.. ఇక కనకవర్షమే

మెగాస్టార్‌ చిరంజీవి న‌టించిన‌ ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌ై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ టాక్ మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది. ఫలితంగా ‘ఖైదీ

మెగాస్టార్‌ చిరంజీవి న‌టించిన‌ ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌ై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ టాక్ మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది. ఫలితంగా ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం ప్ర‌ద‌ర్శితమ‌వుతున్న‌ థియేట‌ర్ల ముందు చిరు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
 
ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు తొలి ఆటనే చూశారు. వీరిలో సినీన‌టుడు అల్లు అర్జున్, అల్లు శిరీష్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్‌ రాజులతో పాటు.. అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వీరంతా చిరంజీవి సినిమాపై ట్వీట్ చేసి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
 
‘అమ్మడు! లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు!’ అంటూ అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేస్తే.. ‘బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్‌ అడిస్తున్న మెగాస్టార్‌..’ అని హ‌రీశ్‌ శంక‌ర్‌ ట్వీట్‌ చేశాడు. మ‌రోవైపు అల్లు శిరీష్ ఏకంగా ‘మెగా సర్జికల్‌ స్ట్రయిక్‌’ అని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. అలాగే, చిత్రం చాలా బాగుందంటూ దిల్ రాజు ట్వీట్ చేశారు. 
 
మరోవైపు.. భారీ అంచనాల నడుమ బుధవారం విడుదలైన 'ఖైదీ నంబర్ 150' చిత్రం ప్రీమియర్ షోలు పూర్తి కాకుండానే అమెరికాలో మిలియన్ డాలర్లు (సుమారు రూ.6.7 కోట్లు) వసూలు చేసింది. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్, హాస్య నటుడు వెన్నెల కిషోర్‌లు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉందన్న రివ్యూలు వస్తుండటంతో, ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో శుక్రవారం నుంచి మరిన్ని షోలు వేసేందుకు నిర్ణయించాయి. 
 
కాగా, ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోందని చెబుతూ, హీరోయిన్ కాజల్ థియేటర్‌లో అభిమానులు సందడి చేస్తున్న చిత్రాన్ని షేర్ చేసుకుంది. చిత్రం సూపర్ హిట్ అయిందని ఓ అభిమాని చేసిన ట్వీట్‌ను సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ రీట్వీట్ చేశాడు.