మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By preethi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (11:54 IST)

చలపతి బాబాయ్.. మళ్లీ నోరు జారాడు...

'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో వేడుకలో "అమ్మాయిలు హానికరం కాదుకానీ.. పక్కలోకి పనికి వస్తారంటూ" కామెంట్ చేసి ఆపై మహిళా సంఘాలు, సామాజిక సంస్థల నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో క్షమాపణలు చెప్పుకున్న చ

'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో వేడుకలో "అమ్మాయిలు హానికరం కాదుకానీ.. పక్కలోకి పనికి వస్తారంటూ" కామెంట్ చేసి ఆపై మహిళా సంఘాలు, సామాజిక సంస్థల నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో క్షమాపణలు చెప్పుకున్న చలపతిరావు స్త్రీల విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "గతంలో అమ్మాయిలు ఒక వయస్సుకు వచ్చాక ఓణీలు వేసుకునేవారు, కానీ ప్రస్తుతం ప్యాంటు, టీషర్టులు వంటివి వేసుకుంటున్నారు, ఓణీని తలకు, మెడకు చుట్టుకుంటున్నారు. ఒకవేళ వారికి అది త‌ప్పు అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే.. వారిని చాదస్తపరుడు, ముసలోడు అంటారు.. వాళ్ల ఖర్మకు వాళ్లనే వదిలేస్తున్నా. ఈ విధంగా వస్త్రధారణ చేసుకున్నప్పుడు కుర్రాళ్లు కామెంట్ చేస్తారు. ఓపిక ఉంటే పడాలి లేదా దెబ్బలాడాలి. ఒకటి పద్ధతైనా మార్చుకోవాలి లేదా వాళ్లేమన్నా కూడా పడాలి" అని అన్నారు. 
 
కానీ చీర కట్టినవారిని కూడా ఆకతాయిలు వదలడం లేదు కదా అని యాంకర్ ప్రశ్నించగా.. ‘అంటారండీ. ఇది ప్రజాస్వామ్య దేశం.. ఎవడైనా ఏమైనా అంటాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలావుంటే ఎవడూ మనజోలికి రాడు..’ అని వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి మహిళాలోకంపై దండెత్తారు. కానీ ఈసారి మాత్రం ఆయనను కొంతమంది సమర్థిస్తున్నారు. ఆయన అన్నదాంట్లో తప్పు లేదని, ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉందని కొందరు ఆయనకు వంత పాడుతున్నారు.