బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 21 జులై 2016 (13:27 IST)

'లింగా'తో 'కబాలి'కి లింకేంటి...? కబాలి విడుదలకు చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్

లింగా నష్టాన్ని పూడ్చుతానంటూ తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వలేదంటూ లింగా డిస్ట్రిబ్యూటర్ వేసిన పిటీషన్ ను చెన్నై హైకోర్టు తోసిపుచ్చింది. లింగా సినిమాతో కబాలికి లింకు లేదనీ, ఆ చిత్రంతో ఈ చిత్రం విడుదలకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాబట్టి కబాలి చిత్రా

లింగా నష్టాన్ని పూడ్చుతానంటూ తనకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వలేదంటూ లింగా డిస్ట్రిబ్యూటర్ వేసిన పిటీషన్ ను చెన్నై హైకోర్టు తోసిపుచ్చింది. లింగా సినిమాతో కబాలికి లింకు లేదనీ, ఆ చిత్రంతో ఈ చిత్రం విడుదలకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాబట్టి కబాలి చిత్రాన్ని విడుదల చేయరాదంటూ పిటీషనర్ వేసిన పిటీషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. దీనితో కబాలి విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 
 
మరోవైపు కబాలి ఫీవర్ తో రజినీకాంత్ అభిమానులు ఊగిపోతున్నారు. రజినీకాంత్ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కబాలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.