సంబంధిత వార్తలు
- చిరంజీవి పుట్టినరోజున పరాక్రమం రిలీజ్ సంతోషంగా ఉంది : బండి సరోజ్ కుమార్
- బాలక్రిష్ణ, నితిన్ మెహతా, బాబీ డియోల్ చిత్రం తాజా అప్ డేట్
- నాలుగోసారి తెరపై కనిపించనున్న డార్లింగ్, త్రిష
- కమిటీ కుర్రోళ్లు నిర్మించిన నిహారిక మల్టీటాలెంట్ : మెగాస్టార్ చిరంజీవి
- 360కి పెరిగిన వయనాడ్ మృతులు.. చిరంజీవి, చెర్రీ, అల్లు అర్జున్ ఆర్థికసాయం ఎంత?
ఒక వేదికపైకి బాలకృష్ణ - చిరంజీవి!?
టాలీవుడ్ అగ్ర నటులు బాలయ్య, చిరంజీవిలను ఒకే వేదికపై చూడాలని వారి అభిమానులే కాదు. మొత్తం చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురు చూస్తుంది. సెప్టెంబరు ఒకటో తేదీన నోవాటెల్ ఇందుకు వేదిక కానుంది. బాలయ్య స్వర్ణోత్సవ వేడులకు మెగాస్టార్ ఇప్పటికే ఆహ్వానం అందుకున్నారు.
ఏసీ సీఎం చంద్రబాబు నాయడు కూడా వస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రాకపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. చాలా రోజుల అనంతరం అటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ఇటు రాజకీయ ప్రముఖులు కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగనుంది.
మరోపక్క బాలయ్య అభిమానులు ఎపి లో అమరావతి ప్రాంతంలో మరో భారీ వేడుకను నిర్వహించనున్నారు. చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేని విధంగా, బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఇటు చిత్ర పరిశ్రమ ఇటు అభిమానులు పదిరోజుల వ్యవధిలో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30న అభిమానుల ఆధ్వర్యంలో జరగబోయే ఎన్‌బీకే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ప్రకటించనున్నారు.
