మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (09:38 IST)

మెగాఫ్యాన్స్‌కి బాస్ షాక్... 'ఖైదీ నం.150' ఆడియో రిలీజ్ ఫంక్షన్ రద్దు

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం.150' మీద ఎన్నో అంచనాలు, మరెన్నో ఊహాగానాలు, ఎన్నో రూమర్లు ఉన్నాయి. వీటికి మరింత ఊతమిస్తూ ఇప్పుడు ఈ సినిమా ఆడియో వేడుకను టీం రద్దు చేసిందన్న వార్త మెగాఫ్యాన్స్‌

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం.150' మీద ఎన్నో అంచనాలు, మరెన్నో ఊహాగానాలు, ఎన్నో రూమర్లు ఉన్నాయి. వీటికి మరింత ఊతమిస్తూ ఇప్పుడు ఈ సినిమా ఆడియో వేడుకను టీం రద్దు చేసిందన్న వార్త మెగాఫ్యాన్స్‌కు షాక్ ఇస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఊపుమీదున్న మెగాఫ్యాన్స్‌కు ఇది సడన్ బ్రేక్‌లా మారింది. 
 
హీరో అల్లు అర్జున్ మూవీ 'సరైనోడు', రామ్ చరణ్ 'ధృవ' విషయంలో కూడా ఇలాగే జరిగింది. తాజాగా ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్న 'ఖైదీ నం.150' సినిమా ఆడియో విషయంలో కూడా ఇలాగే జరగబోతోందట. డిసెంబర్ 25న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అంగరంగవైభవంగా జరుగుతుందని అభిమానులంతా ఆశించారు. 
 
కానీ, ఈ ఆడియో ఫంక్షన్‌ను రద్దు చేసి అదేరోజున పాటలను నేరుగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని అటు ఇండస్ట్రీ జనాలు, ఇటు అభిమానులు తీవ్రంగా ఆలోచిస్తున్నారట. అయితే, ఖైదీ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లు దాంతో ఫంక్షన్ నిర్వహణకు సమయం తక్కువగా ఉండడంతోనే ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.