శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 26 నవంబరు 2016 (19:07 IST)

సెన్సార్ పూర్తి చేసుకున్న సప్తగిరి ఎక్స్‌ప్రెస్... డిసెంబరులో విడుదలకు రెడీ...

శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్

శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. 
 
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఆడియో విడుదల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. లహరి వారు ఈ చిత్ర ఆడియోను మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. పాటలకి సైతం భారీ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘యు/ఏ’ రేటింగ్ తో ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్ తెలిపారు.
 
కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కొ-ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, ఫైట్స్ : స్టంట్స్ జాషువా, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.