బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (10:52 IST)

జక్కన్న తర్వాతి సినిమాపై క్లారిటీ...

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత నిర్మించబోయే చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన తన చిత్రాన్ని డీవీవీ దానయ్యతో కలిసి చేయనున్నారట. అయితే, ఈ చిత్రంలో నట

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత నిర్మించబోయే చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన తన చిత్రాన్ని డీవీవీ దానయ్యతో కలిసి చేయనున్నారట. అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటులపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. 
 
'నా తర్వాతి చిత్రంలో ఎవరు నటిస్తారు, దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. దానయ్య(నిర్మాత)తో సినిమాకు ఒప్పుకున్నా. అదే నా తర్వాతి చిత్రం’ అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
మరోవైపు 2019లో రాజమౌళి-మహేశ్‌ సినిమా పట్టాలెక్కే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నారు.