సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 1 ఆగస్టు 2016 (20:43 IST)

అతడు మగాడి లాంటి దర్శకుడన్నాడు... మరి మిగిలినవారు...

పెళ్లిచూపులు సినిమా చూశాక.. దాని గురించి మాట్లాడుతూ.. తమ్మారెడ్డి భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇండస్ట్రీకి మగాడు దొరికాడంటూ.. చిత్ర దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ గురించి మాట్లాడాడు.. అంటే మిగిలినవారు అటుఇటు కానివారా? అని అడుగుతున్నాను.. అంటూ నవ్వుతూ.. అవున

పెళ్లిచూపులు సినిమా చూశాక.. దాని గురించి మాట్లాడుతూ.. తమ్మారెడ్డి భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇండస్ట్రీకి మగాడు దొరికాడంటూ.. చిత్ర దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ గురించి మాట్లాడాడు.. అంటే మిగిలినవారు అటుఇటు కానివారా? అని అడుగుతున్నాను.. అంటూ నవ్వుతూ.. అవును.. తరుణ్‌ భాస్కర్‌ మగాడే. చిన్న బడ్జెట్‌ చిత్రాల పేరుతో.. స్కిన్‌షో, అసభ్యపదాలు లేకుండా.. మగాడు లాంటి సినిమా తీశాడంటూ మెచ్చుకున్నారు తమ్మారెడ్డి.
 
డి.సురేష్‌ బాబు సమర్పణలో రాజ్‌ కందుకూరి(ధర్మ పథ క్రియేషన్స్‌), యష్‌ రంగినేని(బిగ్‌ బెన్‌ సినిమాస్‌) నిర్మాతలుగా కొత్త దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవర కొండ, రీతూ వర్మ జంటగా రూపొందిన చిత్రం 'పెళ్ళిచూపులు'. జూలై 29న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా థాంక్స్‌విూట్‌ ఏర్పాటు చేశారు. 
 
ఈ కార్యక్రమంలో దర్శకరత్న డా||దాసరి నారాయణరావు మాట్లాడుతూ ''ఈ రోజుల్లో సినిమాను ఎంత గొప్పగా తీశామనడం కంటే ఎంత బాగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లామనేదే ముఖ్యం. ఆ విషయంలో సక్సెస్‌ అయిన సురేష్‌ బాబుగారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. రాజ్‌ కందుకూరి చాలా మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాత. నాకు తెలసి బడ్జెట్‌ సినిమాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు మాత్రమే ఉన్నాయి. చిన్న సినిమాలు లేవు. ఏ పెద్ద హీరో అయినా బడ్జెట్‌ సినిమాల నుండే వచ్చినవాడు. ప్రతి ఒక్కరి టాలెంట్‌ను, రిస్క్‌ లేకుండా ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లేది బడ్జెట్‌ సినిమాలు మాత్రమే. చాలాసార్లు విూడియా వారు మంచి సినిమా అంటే ఏంటని అడుగుతుంటారు. వారికి చెప్పేదేంటంటే పెళ్ళిచూపులు మంచి సినిమా. 
 
చాలామంది నేను చేసిన పెద్ద బడ్జెట్‌ సినిమాల గురించే మాట్లాడుతుంటారు. కానీ నేను చేసిన తొలి 25 సినిమాలు బడ్జెట్‌ సినిమాలే. బాహుబలి గొప్ప సినిమా. పెద్ద బడ్జెట్‌ సినిమా, విూరు దానికి ఓటేస్తారా, పెళ్ళిచూపులకు ఓటేస్తారా అని ఎవరైనా అడిగితే నేను పెళ్ళిచూపులు చిత్రానికే ఓటేస్తాను. ఇది నిర్మాతల గొప్పతనం అనడం కన్నా దర్శకుడు తరుణ్‌ గొప్పతనం. జనం ఇలాంటి సినిమాలనే కావాలనుకుంటారు. ఈ సినిమా ఒకట్నిర కోటితో రూపొందినా 12 - 15 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను వసూలు చేస్తుందని చెబుతున్నాను. 
 
సినిమా అంటే రికార్డులు తిరగరాయడం కాదు, చరిత్రలో నిలిచిపోవడమే. గత ఐదారు సంవత్సరాలుగా తెలుగు సినిమా నాశనం అయిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇక్కడ క్రియేటివ్‌ సినిమాలు రావడం లేదు. తమిళ్‌, హిందీల్లో కొత్త ఇన్నోవేటివ్‌ పాయింట్‌తో సినిమాలు తీస్తున్నారు. స్కిన్‌షో, మసాలా లేని, వెకిలి లేని, నిజాయితీ ఉన్న సినిమాయే పెళ్ళిచూపులు. కథలు ఎక్కడనుండో రావు. మన చుట్టుపక్కల ఉంటాయి. అలాంటి కథను తీసుకుని రియాలిటీకి దగ్గరగా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు. ఇలాంటి సినిమాలు ఓ పది సినిమాలు వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ మళ్ళీ నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంటుంది'' అన్నారు.