గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (14:12 IST)

హాలీవు్డ్ హీరో డీసిల్‌తో ఆ సంబంధం ఊహాజనితమే : దీపికా పదుకొనే

హాలీవుడ్ హీరో విన్ డీసిల్‌తో శారీరక సంబంధం ఉన్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజంలేదనీ, అవన్నీ కేవలం ఊహాజనితమేనని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలిపారు.

హాలీవుడ్ హీరో విన్ డీసిల్‌తో శారీరక సంబంధం ఉన్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజంలేదనీ, అవన్నీ కేవలం ఊహాజనితమేనని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలిపారు. 
 
దీపికా పదుకొణే నటించిన హాలీవుడ్ చిత్రం 'త్రిబుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌' భారత్‌లో ఈ నెల 17న విడుదలైంది. మెక్సికో నగరంలో జనవరి 5నే ఈ సినిమా విడుదలైనా, అమెరికాలో 20న విడుదలైంది. లాస్‌ ఏంజెలెస్‌ నగరంలో 'ది ఎల్లెన్‌ డి-జెనెరస్‌ షో' పేరుతో ఇటీవలే ఈ చిత్రం ప్రచార చాట్‌ షో జరిగింది. 
 
ఈ సందర్భంగా వెండితెరమీద విన్‌ డీసిల్‌తో తన కెమిస్ట్రీ గురించి అడిగిన ప్రశ్నకు దీపికా పదుకొణే ఆశ్చర్యకరమైన జవాబు ఇచ్చింది. 'నా తలపులో విన్‌ డీసిల్‌తో అద్భుతమైన సంతానాన్ని పొందవచ్చు. అది వూహాజనీతమే కానీ కార్యరూపం దాల్చేందుకు కాదు సుమా' అనేది ఆమె జవాబు.
 
అయితే డి-జెనెరస్‌ ఇంకొంచెం ముందుకు వెళ్లి 'మీ ఇద్దరి మధ్యా శృంగార బంధం ఉందని వదంతులున్నాయి' అని అడిగిన ప్రశ్నకు దీపికా పదుకొణే తెలివిగా 'నిప్పు లేనిదే పొగ రాదుకదా' అంటూ మందహాసం చేసింది.