గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (13:22 IST)

బిగ్ బాస్‌లో మెరిసిన దేత్తడి హారిక... హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది...

dethadi harika
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మెరిచిన దేత్తడి హారిక.. ఈ సీజన్‌లో టాప్-5గా నిలించారు. ఇపుడు హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. యూట్యూబర్‌గా ఎంతో మాస్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుని ఈ భామ... సాయి రాజేష్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో కథానాయికగా ఎంపికైంది.
 
సాయి రాజేష్ దర్శకత్వం వహించిన "బేబీ" చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. ఇపుడు ఈయన మరో చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం నటీ నటుల ఎంపిక సాగుతుంది. ఇందులోభాగంగా, దేత్తడి హారికను హీరోయిన్‌గా ఆయన ఎంపిక చేశారు. 
 
ఇప్పటికే ప్రీప్రొడక్షన్ నిర్మాణ పనులు పూర్తికాగా, సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యూట్యూబర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న దేత్తడి హారిక.. సినిమాలలో ఎంతమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.