బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (12:22 IST)

ఏంజెలీనా జోలీగా మారాలనుకుని.. ఇలా తయారైంది

సినీ తారల్లా తాము కూడా మారాలని.. వారిలా అందంగా కనిపించాలని అభిమానులు భావిస్తుంటారు. వారి అలవాట్లను అనుసరిస్తుంటారు. వీరాభిమానులైతే ఒకడుగు అధికమే. తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీలా మారాలని భా

సినీ తారల్లా తాము కూడా మారాలని.. వారిలా అందంగా కనిపించాలని అభిమానులు భావిస్తుంటారు. వారి అలవాట్లను అనుసరిస్తుంటారు. వీరాభిమానులైతే ఒకడుగు అధికమే. తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీలా మారాలని భావించింది.
 
అయితే ఆ ప్రయోగం కాస్త వికటించింది. ఈ ఘటన ఇరాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఏంజెలీనా జోలీగా మారాలనుకుంది ఇరాన్‌కు చెందిన సహర్ తబర్ (19). ఈమె ఏంజెలీనాకు వీరాభిమాని.
 
ఈ మేరకు ప్లాస్టిక్ సర్జరీకి కూడా సిద్ధమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. కానీ ఆ ప్లాస్టిక్ సర్జరీలు అన్నీ విఫలమయ్యాయి. చివరికి కుందనాల బొమ్మగా వున్న ఆమె ముఖం దారుణంగా తయారైంది. 
 
ఏంజెలీనాలా మారాలనుకున్న తన ఫేస్ ఇలా మారిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసైనా.. అభిమాన తారల్లా మారాలనుకునే ప్రయత్నాలను పక్కనబెట్టండి అంటూ కోరింది.