1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2016 (15:44 IST)

మురుగదాస్‌ సోదరుడు దిలీపన్‌-అంజలి కాంబినేషన్‌లో 'గోలీసోడా'

దిలీపన్‌, అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఏ.ఆర్. మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి. కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో ఏ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'.

దిలీపన్‌, అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఏ.ఆర్. మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి. కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో ఏ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'. తమిళ్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్రావ్‌ మార్టోరి 'గోలీసోడా' పేరుతో తెలుగులో ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనెలలోనే రిలీజ్‌కి రెఢీ అవుతోంది. 
 
నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి మాట్లాడుతూ... ''ఎ.ఆర్‌. మురుగదాస్‌ శిష్యుడు కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో మురుగదాస్‌ సోదరుడు దిలీపన్‌ని హీరోగా పరిచయం చేస్తూ చేస్తూ మురుగదాస్‌ తమిళంలో నిర్మించిన 'వత్తికుచ్చి' చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఈ చిత్రంలో దిలీపన్‌ అద్భుతంగా నటించాడు. అలాగే అంజలి డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో ఎక్స్‌లెంట్‌ పెర్‌ఫార్మ్‌ ప్రదర్శించింది. యువ సంచలన సంగీత దర్శకుడు జిబ్రాన్‌ అందించిన సంగీతం సూపర్‌హిట్‌ అయ్యింది. యూత్‌, లవ్‌, ఫ్యామిలీ, సెంటిమెంట్‌తో పాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. 
 
రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకొని నేచురాలిటీకి దగ్గరగా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. డబ్బింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసి, సెప్టెంబర్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. దిలీపన్‌, అంజలి జంటగా నటించిన ఈ చిత్రంలో సంపత్‌, జయప్రకాష్‌, జగన్‌, సతీష్‌, అఖిల్‌కుమార్‌, శరణ్య పొన్‌వన్నన్‌, రాజశ్రీ, అంగనారాయ్‌ తదితరులు నటించిన ఈ 
 
చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, కెమెరా: ఆర్‌.బి. గురుదేవ్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌, ఎన్‌.బి. శ్రీకాంత్‌, నిర్మాత: వెంకట్రావ్‌ మార్టోరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పి.కిన్‌స్లిన్‌.