ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (16:07 IST)

వదినమ్మ చేత తమ్ముడు అని పిలిపించుకున్న కార్తీ? (video)

హీరో కార్తీకి సినీ నటి జ్యోతిక వదినమ్మ అనే విషయం అందరికీ తెలుసు. అయితే వీళ్లిద్దరూ అక్కాతమ్ముళ్లుగా మారిపోయారు. కార్తీ, జ్యోతిక అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్న సినిమా తంబి. తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల కానుంది. 
 
మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దృశ్యం’ ఫేమ్.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో, వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పణలో, పారాలాల్ మైండ్స్ ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు టీజర్ శనివారం ఉదయం అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
 
సూర్య తమిళ్, మోహన్ లాన్ మలయాళ టీజర్ రిలీజ్ చేస్తూ.. మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కార్తీ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఒక్కో కేసుకి ఒక్కో పేరు మార్చుకునే దొంగగా కార్తి కనిపిస్తుండగా, అతని కోసం ఎదురుచూసే అక్క పార్వతిగా జ్యోతిక, తండ్రిగా సత్యరాజ్ కనిపిస్తున్నారు.
 
రకరకాల పేర్లతో పలువురిని మోసం చేసిన దొంగ, అక్క కోసం ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ, అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకు హైలెట్ కానుందని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. డిసెంబరులో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను ఓ లుక్కేయండి.