గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (22:28 IST)

డ్రగ్స్ కేసు విచారణలో ఉన్న రకుల్, క్రిష్‌కి చేసిన ప్రామిస్ ఏంటి..?

బాలీవుడ్‌ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది రకుల్ ప్రీత్ సింగ్. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటకు వచ్చినప్పడు అంతా షాక్ అయ్యారు. రకుల్ ఏంటి..? డ్రగ్స్ కేసులో ఉండడం ఏంటి..? అనుకున్నారు కానీ.. రియాతో పరిచయం ఉండడం.. రియా రకుల్ పేరు చెప్పడం.. రకుల్ ఇంట్లో డ్రగ్స్ ఉండడంతో రకుల్ ఈ కేసు నుంచి బయటపడుతుందా..? లేదా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది.
 
ఇదిలా ఉంటే... రకుల్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తుంది. వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన క్రిష్‌ - రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.
 
అయితే.. ఈ సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. చాలా ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేద్దామనుకుంటుంటే.. ఇలా జరిగింది ఏంటి అని క్రిష్ బాగా టెన్షన్ పడుతున్నాడట. ఐతే ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తానంటూ రకుల్ హైదరాబాద్ వచ్చేయడంతో క్రిష్ హ్యాపీ ఫీలవుతున్నాడట.