బాహుబలి 2: తొలి 30 నిమిషాల సినిమా అప్పుడే ఆన్‌లైన్‌లో లీక్
బాహుబలి సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా ప్రతిచోట పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే నెట్లో సినిమా లీక్ కావడం ప్రస్తుతం సినీ యూనిట్‌ను ఆందోళన పరుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే?
బాహుబలి సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా ప్రతిచోట పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే నెట్లో సినిమా లీక్ కావడం ప్రస్తుతం సినీ యూనిట్‌ను ఆందోళన పరుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే? బాహుబలి 2 తొలి 30 నిమిషాల సినిమా అప్పుడే ఆన్‌లైన్‌లో లీకైంది.
సినిమాను లీక్ చేసిందెవరో తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిందితులను కనుగొనే పనిలో పడ్డాడు. గురువారం సాయంత్రం ఈ సినిమా బెన్‌ఫిట్ షోను పలుచోట్ల ప్రదర్శించారు. ఆ సమయంలో వీడియోను రికార్డ్ చేసి నెట్‌లో పెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పైరసీ సినిమాలను ప్రోత్సహించే ఓ ప్రముఖ పైరసీ మూవీ సైట్‌లో కూడా బాహుబలి2 30 నిమిషాల సినిమా హల్‌చల్ చేస్తోంది. పోలీసులు, ఫ్యాన్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ పైరసీని నియంత్రించలేకపోతున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదని టాక్ వస్తోంది. వెండితెరపై ఈ కళాకండాన్ని చూసిన వారంతా సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం అన్ని భాషల్లో సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.