మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (14:34 IST)

బిగ్ బాస్ కంటిస్టెంట్.. సోఫియా హయత్ ఉంగరాన్నికట్టుకున్న భర్తే దొంగలించి?

బిగ్ బాస్ కంటిస్టెంట్.. సోఫియా హయత్.. భర్తచే ప్రాణహాని వుందని?

హిందీ బిగ్ బాస్ 7లో పాల్గొన్న మోడల్ సోఫియా హయత్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ షో లోనే కాదునిజ జీవితంలో కూడా సోఫియా చాలా ఆరోపణలు ఎదుర్కొంది. 2016లో తాను నన్‌గా మారినట్లు ప్రకటించింది. ఆపై ఆమె మామూలు జీవితమే గడుపుతూ, మేకప్ వాడుతున్నట్లు ఫొటోలు వైరల్ కావడంతో క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం సోఫియా భర్త విషయంలో ఏకంగా ప్రాణహాని ఉందని కేసుపెట్టింది. 
 
బిగ్ బాస్ హిందీ ఏడో సీజన్‌లో అర్మాన్ కోహ్లీతో గొడవపడి బిగ్ బాస్ షో నుంచి నిష్క్రమించిన సోఫియా ప్రస్తుతం తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ లండన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెల రోజుల గాలింపు అనంతరం సోఫియా హయత్ భర్త వ్లాద్‌ స్టానెస్కును లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. సోఫియా 2017లో రొమేనియాకి చెందిన వ్లాద్ స్టానెస్కును ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు తాను ఇంటీరియర్ డిజైనర్‌‌నని చెప్పి భర్త తనను మోసం చేశాడని, అంతటితో ఆగకుండా తన గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఇంకా రూ.10 లక్షల విలువ చేసే తన వివాహ ఉంగరాన్ని దొంగిలించి, దానిని 1.5 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. సింగర్, మోడల్ అయిన సోఫియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాపింగ్ మాల్‌లో వ్లాద్ స్టానెస్కును అరెస్ట్ చేశారు.