"గౌతమీపుత్ర శాతకర్ణి" టైటిల్ సాంగ్ లీక్... ఆన్‌లైన్‌లో హల్‌చల్... (మీరూ వినండి - Video)

యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 100వ చిత్ర "గౌతమీపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం టైటిల్ సాంగ్ ఇపుడు సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. పూర్తి క్

Gautamiputra Satakarni
pnr| Last Updated: ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (11:17 IST)
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 100వ చిత్ర "గౌతమీపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం టైటిల్ సాంగ్ ఇపుడు సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. పూర్తి క్వాలిటీతో కూడిన ఈ పాటను అభిమానులు ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తున్నారు.

"విద్రాజిత సంభ్రవాముఖా జన తేజం... సంప్రోక్షిత పాలాక్ష ప్రమోద ప్రసారం... నిజముద్రా వివితోహయ వాహనవాహం... శకయవ్వన పల్లవదీక్షిత దుర్భేద్యం... దిగ్దికాంత కీర్తిక రజనీ... శాతకర్ణీ... శాతకర్ణీ... గౌతమీ పుత్ర శాతకర్ణీ" అంటూ ఈ పాట సాగుతుంది.

శాతకర్ణి అశ్వమేధయాగం చేస్తున్న వేళ, తన తల్లి పేరు అయిన గౌతమిని తన పేరు ముందు చేర్చుకునే సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ ఎలా లీక్ అయిందన్న విషయం తెలియక నిర్మాతలు, యూనిట్ తలపట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ టైటిల్ సాంగ్‌ సూపర్‌గా ఉందనే కామెంట్స్ వినిపిస్తుండటంతో చిత్ర యూనిట్ తెగ సంబరపడి పోతోంది.

దీనిపై మరింత చదవండి :