ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (23:37 IST)

రామ్ చరణ్‌కు గోల్డెన్ అవార్డు.. షారూఖ్‌నే వెనక్కి నెట్టేశాడుగా..!

Ramcharan
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌కు తాజాగా గోల్డెన్ అవార్డు ప్రకటించారు. గోల్డెన్‌ బాలీవుడ్‌ యాక్టర్‌ కేటగిరీలో రామ్‌ చరణ్‌‌కు ఈ అవార్డు లభించింది. తద్వారా చెర్రీ ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు చేరింది.

ఈ పురస్కారం కోసం షారుఖ్‌ ఖాన్‌, దీపిక పదుకొనే, అర్జున్‌ మాథుర్‌, ఆదా శర్మ, రాశి ఖన్నా, విశేష్‌ భన్సాల్‌, రిద్ధి డోగ్రా కూడా నామినేట్‌ అయ్యారు. 
 
వీరందరినీ వెనక్కి నెట్టి రామ్‌ చరణ్‌ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. పాప్‌ గోల్డెన్‌ అవార్డ్స్‌ ఇతర కేటగిరీల్లో అంతర్జాతీయ పాప్‌ స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌, కొరియా మ్యూజిక్‌ బ్యాండ్‌ బీటీఎస్‌ కూడా విజేతలుగా నిలిచారు.