చివరి షెడ్యూల్ చిత్రీకరణలో గోపీచంద్ 'ఆక్సిజన్'
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్'. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
ఈ సందర్భంగా చిత్రయూనిట్ హీరో గోపీచంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. మా యాక్షన్ హీరో గోపీచంద్‌కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన హీరోగా మా బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆక్సిజన్' చిత్రం ఇప్పుడు చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది.
ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు డిఫరెంట్ సబ్జెక్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్‌గా ఉంటుంది.
అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలువనుంది. త్వరలోనే ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరపుకుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.
గోపీచంద్, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, 'కిక్' శ్యామ్, ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్:పీటర్ హెయిన్, ఆర్ట్: మిలన్, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.