శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (14:50 IST)

#HappyBirthdayAnupama ''ప్రేమమ్''తో పాపులర్.. దర్శకురాలిగా అనుపమ

Anupama parameswaran
''ప్రేమమ్'' సినిమాతో పాపులరైన అనుపమ పరమేశ్వరన్‌కు నేడు పుట్టిన రోజు. ప్రేమమ్ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో ఆమెకు అవకాశాలు వెల్లువల్లా వచ్చాయి. కానీ ప్రస్తుతం కాస్త ఆఫర్లు సన్నగిల్లడంతో వెనక్కి పడింది అనుపమ. కోలీవుడ్, టాలీవుడ్‌లలో సినిమా ఛాన్సులు తగ్గడంతో కొన్నాళ్లుగా మ‌ల‌యాళంలోనే సినిమాలు చేస్తూ వ‌స్తున్న ఈ చిన్న‌ది తాజాగా తెలుగులో ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ని చేజిక్కించుకున్న‌ట్టు స‌మాచారం.
 
దిల్‌రాజు నిర్మాణంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లానింగ్‌లో ఉంద‌ట‌. ఒక యువ ద‌ర్శ‌కుడు తీయ‌బోతున్న ఆ సినిమాలో అనుప‌మ అవ‌కాశం అందుకున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.
 
ప్రస్తుతం అనుపమ మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. ఇంకా క‌థానాయిక‌గా అవ‌కాశాలు త‌గ్గాక పూర్తి స్థాయిలో దర్శకత్వంపై దృష్టిపెట్టాలని చూస్తోంది. మొత్తానికి నటిగా మెరుస్తునే సహాయ దర్శకురాలి అవతారం ఎత్తిన అనుపమ త్వరలో దర్శకురాలిగా మారాలని పుట్టిన రోజు సందర్భంగా ఆకాంక్షిద్దాం..