సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 24 జూన్ 2019 (17:35 IST)

నితిన్ వరుస సినిమాలు.. రకుల్, ప్రియా ప్రకాష్‌తో రొమాన్స్

యంగ్ హీరో నితిన్ వరుసపెట్టి సినిమాలు తీయడానికి రెఢీ అయిపోతున్నాడు. ఇటీవలే ఛలో సినిమాని డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరితో భీష్మ అనే సినిమాని స్టార్ట్ చేశాడు, నిన్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఇంకొక సినిమాను మొదలెట్టాడు.


ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితం నితిన్ మరో సినిమాను ప్రకటించాడు.
 
మజ్నుతో నిరాశపరిచిన దర్శకుడు వెంకీ అట్లూరితో రంగ్‌దే అనే సినిమాను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. ఇది పూర్తిస్థాయి లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.