నేను నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కి వస్తోంది. తమిళ్ లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నాను. విష్ణు విశాల్ తో ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పుడు విశ్వక్ సేన్ తో చేసిన మెకానిక్ రాకీ ఈనెల 22న రాబోతుందని కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు.
రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కూడా నటించింది. ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. కాగా, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సినిమా గురించి పలు విశేషాలని పంచుకున్నారు.
ఈ కథలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?
-నేను ఒక ఆర్మీ ఫ్యామిలీలో పుట్టాను. ప్రతి రెండేళ్ళకోసారి స్టేట్ షిఫ్ట్ అవుతుంటాము. సహజంగానే నాకు డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ పీరియన్స్ చేయడం ఇష్టం. 'మెకానిక్ రాకీ'లో నాది డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పటివరకూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇది నాకు చాలా ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్. ఒక ఛాలెంజ్ తీసుకొని చేశాను. మాయ క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. అలాగే విశ్వక్ తో కలసి నటించడం చాలా ఎక్సయిటెడ్ గా అనిపించింది.
మీ పాత్ర ఎలా వుండబోతోంది ?
-కథలో నా క్యారెక్టర్ కాంట్రీబ్యూషన్ చాలా క్రూషియల్ గా ఉంటుంది. మెకానిక్ రాకీ జీవితంలో మాయ ఎలాంటి రోల్ ప్లే చేసిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆడియన్స్ కి చాలా సర్ ప్రైజ్ లు, ట్విస్ట్ లు వుంటాయి. చాలా విజల్ మూమెంట్స్ వుంటాయి. డైరెక్టర్ రవితేజ చాలా అద్భుతంగా తీశారు.
మీనాక్షితో మీకు కాంబినేషన్ సీన్స్ వున్నాయి ?
-మాకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా లేవు కానీ సెట్స్ లో చాలా సార్లు కలిశాం. తనది కూడా ఆర్మీ కుటుంబమే. మాకు చాలా సిమిలారిటీస్ వున్నాయి.
గతంలో మీరు విశ్వక్ చెప్పిన ఓ కథని రిజెక్ట్ చేశారని విన్నాం?
-అది ఓ రీమేక్. నిజానికి నాకు రిమేక్ సినిమాలు చేయడం అంత ఇష్టం వుండదు. అందుకే ఆ సినిమా చేయడం కుదరలేదు. ఫైనల్ గా మెకానిక్ రాకీలో విశ్వక్ తో కలసి పని చేయడం చాలా ఎక్సయిటెడ్ గా అనిపించింది. విశ్వక్ ఆన్ స్క్రీన్ ఎనర్జీని మ్యాచ్ చేయడం కష్టం. అఫ్ స్క్రీన్ తను చాలా సరదాగా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను..
మీ తొమ్మిదేళ్ళ సినీ జర్నీ ఎలా అనిపిస్తోంది ?
-నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేరు. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ గా తీసుకొని ముందుకు వెళుతున్నాను. ఈ జర్నీలో హైస్ అండ్ లోస్ వున్నాయి. జెర్సీ తర్వాత పీక్స్ చూశాను. కోవిడ్ లో సినిమాలు ఆగినప్పుడు అందరిలానే నేనూ భయపడ్డాను. నా సినీ జర్నీ జీవితంలానే అలా ముందుకు సాగుతోంది. హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. నాకు క్యాలిటీ వర్క్స్ చేయడం ఇష్టం. అందుకే కొంచెం సెలెక్టివ్ గా వుంటాను.
మీ కథ ఎంపిక ఎలా ఉంటుంది ?
-కథ వచ్చినపుడు అది హిట్టా అవుతుందా లేదా అనేది మన చేతిలో వుండదు. పేపర్ మీద అది ఎంత స్ట్రాంగ్ గా వుందో చూసుకుంటాను. అలాగే నా క్యారెక్టర్ కి వున్న ప్రాధాన్యత చూస్తాను. ఒక ఆడియన్ గా ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతానో అలాంటి కథలు చేయడానికి ఇష్టపడతాను.
రివ్యూస్, క్రిటిసిజంను ఎలా తీసుకుంటారు ?
-ఫిలిం క్రిటిసిజంను అంత సీరియస్ గా తీసుకోను. సినిమా గురించి ఎవరైనా ఒపినియన్ చెప్పొచ్చు. ఒక ఆడియన్ గా నాకూ ఒక ఒపినియన్ వుంటుంది. అయితే పర్సనల్ ఎటాక్ మాత్రం కాస్త హర్టింగ్ గా అనిపిస్తుంది.
మీకు ఇష్టమైన జోనర్ ఏమిటి ?
-చూడటాని హారర్ జోనర్ ఇష్టం. 'కల్కి' లాంటి సైన్స్ ఫిక్షన్ కథల్లో నటించడానికి ఇష్టపడతాను. అలాగే బాహుబలి లాంటి పిరియడ్ సినిమాలో పార్ట్ అవ్వాలని వుంటుంది. అలాగే కామెడీ సినిమాల్లో కూడా చేయాలని వుంది. మెకానిక్ రాకీ తర్వాత నాకు ఇంకా డిఫరెంట్ రోల్స్ వస్తాయని భావిస్తున్నాను.