శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (10:23 IST)

సైకిల్‌పై తిరిగిన రోజులు గుర్తుకు వ‌స్తున్నాయ్‌: యాంకర్, నటుడు ప్రదీప్

Hero Pradeep,30days
యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ తొలిసారి హీరోగా పరిచయం అవుతూ నటిస్తున్న చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా". యస్ వి ప్రొడక్షన్స్ పతాకంపై ఫణి ప్రదీప్ దర్శకత్వంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా యస్ వి బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 29న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన `నీలి నీలి ఆకాశం` సాంగ్ 300 మిలియన్స్ పైగా వ్యూస్ తో సెన్షేషనల్ క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదల సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, అడవి శేష్, సింగర్ సునీత, సింగర్ సిడ్ శ్రీరామ్ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేదికపై నీలి నీలి ఆకాశం సాంగ్ ను సింగర్ సిద్ శ్రీరామ్ తో కలిసి సునీత ఆలపించారు.
 
హీరో ప్రదీప్ మాట్లాడుతూ.. నేన సంజీవ్‌రెడ్డి న‌గ‌ర్‌లో సైకిల్‌పై తిరిగిన రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి? అక్క‌డ చాలామందిహీరోల క‌టౌట్లు చూశాను. ఇప్పుడు నా క‌టౌట్ కూడా వుంటే అది నేను చూసుకుంటుంటే ఎంతో ఆనందం  వేసింది. నా త‌ల్లిదండ్రులు నేను ఏది కావాల‌నుకుంటున్నానో అది నెర‌వేరేలా స‌పోర్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌లంద‌రికీ న‌మ‌స్కారం పెడుతున్నా. న‌న్ను మీ వాడిగా ఆశీర్వ‌దించండి. యాంకర్ గా ప్రజలందరూ ఆదరించారు. యాక్టర్ అవ్వాలనేది నా కల. అది తీరడానికి పదేళ్లు పట్టింది. మున్నా ఫస్ట్ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది.

యస్వీ బాబు గారు సినిమాకి అన్నీ ప్రొవైడ్ చేసి అన్ కాంప్రమైజ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్, శివేంద్ర విజువల్స్ సినిమాకి బిగ్ ఎస్సెట్ అవుతాయి. మున్నా కథ విని చాలా ఎక్సయిట్ అయ్యాను. ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అన్నీ ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవుతారు. ఇన్నాళ్లు నన్ను మీ ఇంట్లో ఒకడిగా అభిమానించారు...ఇప్పుడు మీ అబ్బాయి హీరో అవుతున్నాడు తప్పకుండా మీరంతా దేవిస్తరని ఆశిస్తున్నాను అన్నారు.
 
ఈ సినిమాతో ప్రదీప్ హీరోగా నిలబడాలి: ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్. 
ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ..ఈ సినిమాలోని పాటలన్నీ ఇంత పెద్ద సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలుసు. సాంగ్స్ ఈ రేంజ్ లో హిట్ అయ్యయంటే సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాతో యాంకర్ ప్రదీప్ హీరోగా సూపర్ హిట్ అందుకొని హీరోగా నిలబడాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
దర్శకులు మారుతి, అనిల్ రావిపూడి సినిమా సక్సెస్ అయి, హీరోగా ప్రదీప్ సక్సెస్ అందుకోవాలని అభినందనలు తెలియజేశారు. ఈ సినిమాకి ఇంతలా క్రేజ్ రావడానికి కారణం అనూప్ ఇచ్చిన మ్యూజిక్. చంద్రబోస్ వన్డ్రఫుల్ లిరిక్స్ రాశారు. ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా యువి, జిఏ2 ద్వారా సినిమా రిలీజ్ అవుతుంది.. అంత పెద్ద సంస్థలు మా సినిమా విడుదల చేస్తున్నందుకు అదృష్టం గా, గర్వాంగా ఫీలవుతున్నాను. ఇందులోని నీలి నీలి ఆకాశం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు, సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.
 
దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ.. ' మా హీరో ప్రదీప్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. మా నిర్మాత యస్వీ బాబు గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ గారి సాహిత్యం బాగా కుదిరింది. వారికి నా థాంక్స్. సి అందరినీ ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది అన్నారు.