1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 22 డిశెంబరు 2016 (13:44 IST)

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో నటించాలనుంది: అమీర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకునే అమీర్ ఖాన్ చిత్రం డంగల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 23న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తను చిరంజీవి అభిమానిననీ, చిరంజీవి-పవన్ కళ్యా

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకునే అమీర్ ఖాన్ చిత్రం డంగల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 23న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తను చిరంజీవి అభిమానిననీ, చిరంజీవి-పవన్ కళ్యాణ్‌లతో అవకాశం వస్తే నటించాలని ఉందని చెప్పారు. 
 
అంతేకాదు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా నటించాలని ఆశ పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ కోర్కె బయటపెట్టాడు కనుక చిరు, పవన్ ఏమయినా ఆయనతో చిత్రం చేయాలని ఉత్సాహం చూపిస్తారేమో చూడాలి.