ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (11:55 IST)

గౌతమిపై ఎదురుదాడి.. అమ్ముడుపోయారంటూ.. అన్నాడీఎంకే కార్యకర్తల విమర్శలు

తమిళ రాజకీయాల్లో కలకలం రేపిన నటి గౌతమిపై ఎదురుదాడి మొదలైంది. పార్టీకి వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలో గౌతమి పావుగా మారారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుట్రదారులకు గౌతమి అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్ము

తమిళ రాజకీయాల్లో కలకలం రేపిన నటి గౌతమిపై ఎదురుదాడి మొదలైంది. పార్టీకి వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలో గౌతమి పావుగా మారారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుట్రదారులకు గౌతమి అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్ముడుపోయారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. జయ కన్నుమూసి వారం రోజులు గడుస్తున్నా ఆమె మృతిపై సందేహాలు వీడడం లేదు. ఈ క్రమంలో గౌతమి రాసిన లేఖ అందరినీ ఆలోచింప జేసింది.
 
‘అమ్మ’ వచ్చేస్తారని ప్రకటించిన తర్వాతి రోజే అమ్మ పరిస్థితి సీరియస్‌గా ఉందని ప్రకటించడమేంటని, ఆ తర్వాత కన్నుమూశారని చెప్పడమేంటంటూ లేఖలో గౌతమి ప్రశ్నల వర్షం కురిపించారు. గౌతమి లేఖతో ఉలిక్కిపడిన అన్నాడీఎంకే వర్గాలు ఆమెపై ఎదురుదాడికి సిద్ధమయ్యాయి. ఇరకాటంలో పెట్టేలా ఆ పార్టీ నేతలు ఆరోపణల తూటాలను సంధిస్తున్నారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నాంజిల్ మాట్లాడుతూ గౌతమి లేవనెత్తిన ప్రశ్నలను ఖండించారు.
 
ప్రపంచ స్థాయి వైద్యులతో జయకు చికిత్స అందించిన విషయాన్ని గుర్తించాలన్నారు. హద్దులు మీరిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. గౌతమి వ్యాఖ్యలు పార్టీని చీల్చేవిగా ఉన్నాయన్నారు. కుట్రలో భాగంగానే ఆమె లేఖ రాసినట్టు ఆరోపించారు. గౌతమి వ్యాఖ్యలు శోచనీయమని మరో అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి పేర్కొన్నారు.