అనుష్క శర్మ తల్లి కాబోతోందా? ఆ ఫోటో వైరల్ అవుతుందే..!

Anushka-Kohli
Anushka-Kohli
సెల్వి| Last Updated: శుక్రవారం, 19 జూన్ 2020 (18:29 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ గర్భం దాల్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా వున్న అనుష్క శర్మ.. తల్లి కాబోతుందని తెలుస్తోంది.

విరుష్కల వివాహం జరిగి మూడేళ్ళు అవుతుండగా, వీరు ఎప్పుడు శుభవార్త చెప్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మధ్యలో రెండు మూడు సార్లు అనుష్క ప్రెగ్నెంట్ వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ అవాస్తవాలని తేలిపోయింది.

తాజాగా ఓ కేటుగాడు అనుష్క బేబి బంప్‌తో ఉన్నట్టు ఫోటో షాప్ చేశాడు. జెనీలియా ప్రెగ్నెంట్‌తో ఉన్న సమయంలో రితేష్‌తో కలిసి ఉన్న ఫోటోను తీసుకొని వారి ఫేస్‌ల ప్లేస్‌లో అనుష్క, విరాట్ కోహ్లీ ఫేస్‌లను పెట్టాడు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో ద్వారా కూడా అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కాదని తెలుస్తోంది. అంతా మార్ఫింగ్ మాయనే అని తెలుస్తోంది. ఈ ఫోటోపై విరుష్కలు స్పందించాల్సి వుంది. ఇందులో ఎంత నిజముందో లేదో వేచి చూడాలి.దీనిపై మరింత చదవండి :