శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:39 IST)

రోడ్డుపైన ఫినాయిల్ అమ్మిన వ్యక్తి జబర్దస్త్‌లో టాప్ కమెడియన్...

జబర్దస్త్. ఈ కార్యక్రమం కొంతమంది కమెడియన్లకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఖాళీగా ఉన్న కమెడియన్ల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది జబర్దస్త్. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్లే ఈ విషయాన్ని చెబుతుంటారు. అప్పుల్లో ఉన్న తమకు జబర్దస్త్ ఎం

జబర్దస్త్. ఈ కార్యక్రమం కొంతమంది కమెడియన్లకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఖాళీగా ఉన్న కమెడియన్ల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది జబర్దస్త్. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్లే  ఈ విషయాన్ని చెబుతుంటారు. అప్పుల్లో ఉన్న తమకు జబర్దస్త్ ఎంతగానో ఆదుకుని చివరకు తాము తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిలబడేందుకు దోహదపడిందని చెబుతుంటారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకరు.
 
చమ్మక్ చంద్ర 2010 సంవత్సరం నుంచి హైదరాబాద్ రోడ్డుపైన ఫినాయిల్, యాసిడ్ అమ్ముతూ వచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతుంటారు. తన కుటుంబం మరింత హీన స్థితిలో ఉందని, ఫినాయిల్ అమ్మితేనే తాము నాలుగు ముద్దలు తినేవారమని చెబుతున్నారు చమ్మక్ చంద్ర. తానెప్పుడు ఆ పని చేశానని బాధపడలేదని, ఇప్పుడు తనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చారని సంతోషిస్తున్నానని చెబుతున్నారు చమ్మక్ చంద్ర. సినిమాల్లోను చమ్మక్ చంద్రకు మంచి అవకాశాలే వస్తున్నాయి.