1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (13:34 IST)

నోరు జారిన జగపతిబాబు.. తండ్రి జీవితాన్ని ఓ ప్లే బాయ్‌గా ఆనందించా!

హీరో కమ్ విలన్‌గా అవతారం ఎత్తిన జగపతిబాబు నోరు జారారు. తన తండ్రి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనది తండ్రి పోలిక అని చెప్పిన జగపతి బాబు.. ఒకప్పుడు టాప్ నిర్మాతల్లో ఒకరైన తన తండ్రి జీవితాన్ని చూసి.. తాను కూడా ఓ ప్లే బాయ్‌గా జీవితాన్ని ఆనందించానని అనడం కలకలం రేపింది. 
 
సదరు యాంకర్ కూడా ఈ వ్యాఖ్యలకు షాక్ తిన్నా.. ఆ తరువాత ఏమి చెప్పాలో తెలియక నవ్వుకుంది. జగపతిబాబు ఓపెన్ మైండెడ్‌గా ఈ వ్యాఖ్యలు చేసినా.. చనిపోయిన తన తండ్రి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పర్సనల్ విషయాలు బయటికి చెప్పాల్సిన అవసరం ఏమిటని సినీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. 
 
మరోవైపు నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్‌లో అత్యధిక పారితోషకం అందుకునే అతి కొద్ది మంది నటుల్లో ఒకడిగా ఎదిగి పోయిన జగపతి బాబు ఆర్థికంగా కూడా మంచి స్థితికి చేరడంతో తన తండ్రి కోరికలను నెరవేర్చే పనిని ప్రారంభించాడు. తన తండ్రి స్థాపించిన ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ ను తిరిగి ప్రారంభించి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 
 
‘మా నాన్నకు కొన్ని కోరికలుండేవి. నాతో పాటు మా అన్నయ్యకు కూడా అమ్మాయిలే పుట్టడంతో వారసుడు లేడన్న లోటును ఫీలయ్యేవారు మానాన్న. ఇప్పుడు నేను మా జగపతి పిక్చర్స్ సంస్థను తిరిగి ప్రారంభిస్తున్నా. ఈ సంస్థే మా కుటుంబానికి వారసుడిగా భావిస్తున్నా’ అంటూ జగపతిబాబు వ్యాఖ్యానించారు.