శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 20 జులై 2016 (22:00 IST)

ఎంజాయ్‌ చేస్తున్న కబాలి నిర్మాతలు!

రజనీకాంత్‌ 'కబాలి' సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... రోజుకో వార్త పేరుతో పబ్లిసిటీ వచ్చేస్తుంది. అది పెద్ద పబ్లిసిటీ తమకు వుపయోగపడుతుందని.. తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. మామూలుగా డబ్బింగ్‌ సినిమా అయినా... ఏదోరకంగా చిత్రం గురించి.. నిర్మా

రజనీకాంత్‌ 'కబాలి' సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే... రోజుకో వార్త పేరుతో పబ్లిసిటీ వచ్చేస్తుంది. అది పెద్ద పబ్లిసిటీ తమకు వుపయోగపడుతుందని.. తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. మామూలుగా డబ్బింగ్‌ సినిమా అయినా... ఏదోరకంగా చిత్రం గురించి.. నిర్మాతలు వెల్లడించడం ఆనవాయితీ. అయితే.. ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ తెలుగులో విడుదల చేయడంతో.. నైజాంలో 30 కోట్లకు హక్కులు పొంది.. సినిమాను విడుదల చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా గురించి వారు మాట్లాడింది లేదు.
 
తెలుగులో కోస్తాంధ్రాకు చెందిన రవికుమార్‌ మరో ఇద్దరు కలిసి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. అయితే వారి బ్యాక్‌గ్రౌండ్‌లో అల్లు అరవింద్‌ వున్నాడనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా పెద్ద సినిమా.. చిన్న నిర్మాతలకు వెళ్లడం కష్టమైన పనే. అందుకే... ఈ చిత్రానికి చెన్నైలో జరిగిన ఏ సంఘటన వచ్చినా.. దాన్ని హైలైట్‌ చేస్తూ... తెలుగు మీడియా ఏదోరకంగా వార్తలు రాస్తుంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటే సరిపోతుందని తెలుగు నిర్మాతలు భావించడం విశేషం. ఎల్లుండే విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత రవిని సంప్రదిస్తే... అన్నీ రజనీ మేనియాతో కొట్టుకుపోతాయని.. చలోక్తి విసరడం విశేషం.