మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:35 IST)

కుమారుడికి నామకరణం చేసిన కేజీఎఫ్ హీరో

KGF 2
కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రంతో యశ్ బిజీ బిజీగా వున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా యశ్ ఫ్యామిలీ విషయానికి వస్తే 2016లో రాధిక పండిట్‌ని వివాహం చేసుకున్నాడు యశ్. వీరి కూతురు ఐరా, కుమారుడు ఉన్నారు. 
 
అక్టోబర్ 30, 2019న యశ్-రాధిక దంపతులకి కుమారుడు జన్మించగా, తాజాగా నామకరణ వేడుక జరిపించారు. ఫాం హౌజ్‌లో కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపారు. 
 
యధర్వ్ యశ్ అనే పేరుని తన కుమారుడికి పెట్టినట్టు యశ్ పేర్కొన్నారు. ఫోటోలలో యశ్ కుమారుడిని చూసిన అభిమానులు జూనియర్ రాకీ భాయ్ వచ్చేశాడంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.