శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (14:00 IST)

కన్నబిడ్డనే కిరాతకంగా చంపేసిన తండ్రికి జీవిత ఖైదు.. తనకు పుట్టలేదని?

కన్నబిడ్డ మూగ, చెవిటితో పుట్టడంతో ఆ బిడ్డ తనకు పుట్టలేదని ఓ తండ్రి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. హతురాలు మహేశ్వరి (9) తనకు పుట్టలేదని తరచూ భార్యను వేధి

కన్నబిడ్డ మూగ, చెవిటితో పుట్టడంతో ఆ బిడ్డ తనకు పుట్టలేదని ఓ తండ్రి కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. హతురాలు మహేశ్వరి (9) తనకు పుట్టలేదని తరచూ భార్యను వేధించే తిరుపతయ్యకు జీవితఖైదు విధించింది అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం. వివరాల్లోకి వెళితే.. చిలకలూరి పేట మండలం లింగంగుంట్లకు చెందిన కుందూరి తిరపతయ్యకు మహేశ్వరితో పాటు మరో ఇద్దరు సంతానం వున్నారు. 
 
మహేశ్వరి పుట్టుకతోనే చెవుడు, మూగ కావడంతో తనకు పుట్టలేదని భార్యను వేధించసాగాడు. వేధింపులు తాళలేక అతని భార్య తెలిసివారింటికి వెళ్ళిపోయింది. దీన్నే అదనుగా తీసుకున్న తిరుపతయ్య.. మహేశ్వరిని చంపేశాడు. 
 
ఆ సమయంలో తిరుపతయ్య కుమారుడు పవన్ విడిపించేందుకు ప్రయత్నించాడు. ఆపై చికిత్స కోసం స్థానికుల సాయంతో పవన్ ఆస్పత్రిలో చేర్చాడు. అయితే మహేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో నిందితుడు తిరుపతయ్యేనని రుజువు కావడంతో ఆతనిని జీవితఖైదు విధించారు.