గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (12:31 IST)

పండుగాడి (మహేష్) అల్లరిపిల్ల చేష్టలు చూడతరమా.. సమంత డైలాగ్‌ను ఇట్టే చెప్పేసింది... (వీడియో)

'పిట్ట కొంచెం కూత ఘనం' అన్నారు మన పెద్దలు. అలాగే, పులి కడుపున పులే పుడుతుంది. పిల్లి పుట్టదు కదా. ఈ నానుడిని ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితార అక్షరాలా రుజువు చేస్తోంది. నిజానికి ఈ సొట్టబుగ్గల చిన్నద

'పిట్ట కొంచెం కూత ఘనం' అన్నారు మన పెద్దలు. అలాగే, పులి కడుపున పులే పుడుతుంది. పిల్లి పుట్టదు కదా. ఈ నానుడిని ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితార అక్షరాలా రుజువు చేస్తోంది. నిజానికి ఈ సొట్టబుగ్గల చిన్నది.. ఎంతో ముద్దుగా బొద్దుగా చూడముచ్చటగా ఉంటుంది. అలాగే, ఈ ముద్దులొలికే చిన్నారి చేసే అల్లరి అంతాఇంతా కాదు. గతంలో సినిమా అవార్డ్స్ ఫంక్షన్‌లో సితార చేసిన అల్లరి చూడముచ్చటేస్తోంది. 
 
సితార చేసిన డ్యాన్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. సైలెంట్‌గా, డీసెంట్‌గా కనిపించే పండుగాడికి అల్లరి పిల్ల పుట్టిందని మహేష్‌ను సన్నిహితులు ఆటపట్టిస్తారట. 'బ్రహ్మోత్సవం' సినిమాలో సమంత చెప్పిన డైలాగ్‌ను సితార ఎంత అందంగా చెప్పిందో మీరే చూడండి ఈ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.