1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (16:54 IST)

'ఏవో ఏవో కలలే` వింటుంటే సంతోషంగా వుందిః మహేష్ బాబు

Lovestory song
''లవ్ స్టోరి'' చిత్రంలోని 'ఏవో ఏవో కలలే' పాటను రిలీజ్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇవాళ (గురువారం) ఉదయం 10.08 నిమిషాలకు ట్విట్టర్ ద్వారా మహేష్ ఈ పాటను విడుదల చేశారు. అనంతరం మహేష్ బాబు స్పందిస్తూ...''లవ్ స్టోరి'' చిత్రంలోని 'ఏవో ఏవో కలలే' పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి, దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య, నాయిక సాయి పల్లవి ఇతర చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్ అని మహేష్ ట్వీట్ చేశారు. 
 
పాటను రిలీజ్ చేసిన మహేష్ బాబుకు హీరో నాగ చైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. భాస్కరభట్ల గారితో పరిచయం ఏంటో ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ఉంది. అద్భుతంగా రాశారండీ థాంక్స్ అంటూ శేఖర్ కమ్ముల తన ట్వీట్ లో పేర్కొన్నారు.
 
"ఏవో ఏవో కలలే, ఎన్నో ఎన్నో తెరలే, అన్నీ దాటె మనసే" ..అనే పల్లవితో మొదలైందీ పాట. భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా..పవన్ మరోసారి తన ట్యూన్ తో మెస్మరైజ్ చేశారు. జోనిత గాంధీ, నకుల్ అభ్యంకర్ పాటలోని ఫీల్ ను అద్భుతంగా పలికించారు. లవ్ స్టోరి చిత్రంలో ఏవో ఏవో కలలే మంచి డ్యూయెట్ కానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 16న ''లవ్ స్టోరి'' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.