మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (17:05 IST)

తెలుగు సినిమా 90 ఏళ్ళ చరిత్రని నవతిహి ఉత్సవం గా చేయబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

Vishnu Manchu, Kamal Nath, Rajaudi Abdul Rahim, Ravi
Vishnu Manchu, Kamal Nath, Rajaudi Abdul Rahim, Ravi
తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గతంలో వజ్రోత్సవం చేసినట్టు ఈసారి 'నవతిహి ఉత్సవం' చేయబోతున్నారు. త్వరలో మలేషియాలో నవతిహి పేరిట చేయబోయే ఈ చారిత్రాత్మక ఈవెంట్ గురించి ప్రకటించడానికి శనివారం నాడు హైదరాబాద్ పార్క్ హయత్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి 'మా' ప్రసిడెంట్ విష్ణు మంచు, వైస్ ప్రసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నటి మధుమిత శివబాలాజి వ్యవహరించారు. 1932 నుంచి తెలుగు సినిమా గొప్పదనం గురించి, 1993 లో మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తెలిపి గత రెండేళ్లలో 'మా' చేసిన పనులని వివరించారు మధుమిత శివబాలాజి. అనంతరం విష్ణు మంచు ఈ ప్రెస్ మీట్ ని లాంఛనంగా ప్రారంభించారు.
 
MAA EC comity
MAA EC comity
విష్ణు మంచు మాట్లాడుతూ..  'మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన కమల్ నాథ్ గారికి, టూరిజం డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి ఎంతోమంది నటీనటులను గుర్తుచేసుకుంటూ ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా, చాలా సక్సెస్ ఫుల్ గా చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం వాయిదా పడుతూ వస్తుంది. అలాగే ఈ ప్రోగ్రాం నుంచి "మా" కోసం ఫండ్ రైజింగ్ కూడా చేద్దామనుకున్నాం. మలేషియా గవర్నమెంట్ తో చేయాలని నిర్ణయించుకున్నాం. రెండేళ్ల క్రితం నేను మలేషియాలో షూట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే కమల్ నాథ్ గారే నాకు ఎంతో సపోర్ట్ చేసారు. 'మా' తరపున బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్ ను జులైలో మలేషియాలో చేయబోతున్నాము. 
 
డేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సినీ పరిశ్రమ పెద్ధలతో‌ మాట్లాడి డేట్ ను ఎనౌన్స్ చేస్తాము. అందరిని ఈవెంట్ కి వచ్చేలా చేస్తాము. ఇప్పుడు తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా నడుస్తోంది. తెలుగు నటీనటులుగా మేమంతా గర్విస్తున్నాము. తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ నవతిహి ఉత్సవం చేయబోతున్నాము. అమితాబ్, అనీల్ కపూర్.. పలువురు నటులను సినిమాలకు తెలుగువారే పరిచయం చేశారు. మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావడం చాలా గొప్ప విషయం. మన జై బాలయ్య అనే మాట ఎక్కడికి వెళ్లినా వినిపిస్తుంది. నా బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ తెలుగు హీరో నేషనల్ అవార్డ్ తీసుకొచ్చాడు. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. మహేష్ రాజమౌళి గారి సినిమా ఏషియాలోనే  బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కాబోతుంది. రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసారు. కీరవాణి గారు ఫస్ట్ ఆస్కార్ పొందిన తెలుగువారు. ఇలా ఎన్నో సాధిస్తున్నాము. అందుకే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవటం కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాము. మలేషియా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 
 
'మా'లో దాదాపు 800 కి పైగా ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అందులో కొంతమందే బాగా సెటిల్ అయినవాళ్లు. మిగిలిన వాళ్లకు మేము అండగా నిలబడటానికి ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. ఇప్పటికే మేము చేస్తున్న మెడికల్ ఇన్స్యూరెన్స్ చాలా మందికి సపోర్ట్ గా నిలిచింది. ఈ ఈవెంట్ కి ఛాంబర్ తో మాట్లాడాము, నటీనటులు అంతా రావాలి అని అడిగాము. మూడు రోజులు సినిమా ఇండస్ట్రీకి  సెలవులు ఇవ్వాలని కోరాము. దిల్ రాజు, దాము గారు సపోర్ట్ చేస్తామన్నారు. త్వరలోనే ఈ నవతిహి ఈవెంట్ డేట్ ని ప్రకటిస్తాం. పక్క రాష్ట్రాల అన్ని సినీ పరిశ్రమలతో టై అప్ అయ్యాము. అన్ని పరిశ్రమలతో మాట్లాడాను. ఈవెంట్ కి వేరే పరిశ్రమ నటీనటులు కూడా కొంతమంది రాబోతున్నారు' అని తెలిపారు. 
 
మలేషియా అడ్వైజర్ ధాతుక్ కమలనాథన్ మాట్లాడుతూ,  మేము ఈ "మా" ఈవెంట్ ను మలేషియాలో గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయబోతున్నాము. మలేషియా గవర్నమెంట్ కి ధన్యవాదాలు. మలేషియా టూరిజంని 'మా' అందరికి పరిచయం చేయబోతున్నందుకు విష్ణు మంచు గారికి ధన్యవాదాలు' అని అన్నారు.
 
మలేషియా టూరిజం డైరెక్టర్ ఇండియా, శ్రీలంక ప్రతినిధి రాజౌది అబ్దుల్ రాహిమ్ మాట్లాడుతూ, ఇండియా - మలేషియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. టూరిజం మలేషియా ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేస్తున్నందుకు మా టూరిజం ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగపడుతుంది, మలేషియాలో కలుద్దాం' అని తెలిపారు.